దిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే …సెంట్రల్ విస్టా ప్రాజెక్టుని ఎంతో అద్బుతంగా చేస్తున్నారు, ఇందులో పార్లమెంట్ అలాగే ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి ఇళ్లు నిర్మిస్తున్నారు, అయితే పార్లమెంట్ భవనం నుంచి ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి ఇళ్లకు ఎంపీల చాంబర్లకు మూడు భూగర్భ సొరంగాలను నిర్మించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఇక భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా ఇలా పార్లమెంట్ కు చేరుకునేలా దీనిని నిర్మిస్తున్నారు, దీని వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఉండదు… వీరి వాహనాలు వెళ్లే సమయంలో ఎలాంటి వాహానాలు ఆపాల్సిన అవసరం ఉండదు.. ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు ఉండవు అంటున్నారు నిపుణులు. వేగంగా పార్లమెంట్ కు చేరుకునేలా ఈ సొరంగాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
సెంట్రల్ విస్టా భవన నిర్మాణ ప్రణాళిక చూస్తే ప్రధాని ఇల్లు, కార్యాలయం సౌత్ బ్లాక్ వైపు రానున్నాయి. ఉప రాష్ట్రపతి ఇల్లు ఉత్తర దిక్కున బ్లాక్ లో ఉండనుంది. ఇక ఇక్కడ నుంచి వివీ ఐపీలు మాత్రమే వస్తారు ఇక సింగిల్ లేన్ నిర్మాణం చేయనున్నారు అని తెలుస్తోంది దీనిని పరిశీలిస్తున్నారు. ఇక వాహనాలు కూడా చిన్నవి గోల్ఫ్ కార్ట్ వాహనాలు సరిపోతాయి అని భావిస్తున్నారు.. 970 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇది నిర్మిస్తున్నారు..టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇది చేపట్టింది..2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.