బ్రేకింగ్…. వాళ్లందరు పాస్ అయినట్లే

బ్రేకింగ్.... వాళ్లందరు పాస్ అయినట్లే

0
91

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే రోజు రోజు కరోనా కేసుల పాజిటివ్ సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది… ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు వారు ఎటువంటి పరీక్షలు రాయకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ తెలిపారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు… అలాగే మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థుల ఇంటికే అందజేస్తామని తెలిపారు…

ఇక పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 14 తర్వాత అప్పటి పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు… మరో వైపు కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది సర్కార్.. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా ప్రకటించారు