బ్రేకింగ్ విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల వారికి గుడ్ న్యూస్

బ్రేకింగ్ విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల వారికి గుడ్ న్యూస్

0
86

ఏపీలో ఉన్న 13 జిల్లాలో క‌రోనా ప్ర‌భావం కేవ‌లం 11 జిల్లాల్లో ఉంది.. మిగిలిన రెండు జిల్లాల్లో చాలా త‌క్కువ‌గానే ఉంది.. అయితే విజ‌య‌న‌గ‌రం శ్రీకాకుళం జిల్లాల్లో అస‌లు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు దీంతో ఆ ప్రాంతాలు సేఫ్ జోన్ అంటే గ్రీన్ జోన్లో ఉన్నాయి అని అర్దం చేసుకోవ‌చ్చు.

మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా
గ్రీన్ జోన్ల‌కు కాస్త స‌డ‌లింపు ఇస్తారు అని తెలుస్తోంది, అందులో ఏపీలో 11 జిల్లాల్లో ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ..కేవ‌లం శ్రీకాకుళం విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో కేసులు లేవు కాబ‌ట్టి అక్క‌డ‌ కాస్త స‌డ‌లింపు ఇచ్చే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

విజయనగరం జిల్లాలో ఫెర్రో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 20శాతం సిబ్బందితో నడుస్తున్నాయి. అరబిందో, రెడ్డీస్‌, బయోటెక్‌ పరిశ్రమలతోపాటు బల్క్‌ డ్రగ్‌ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది, ఇక ఉపాధి కూలీలు ప‌ని చేసుకోవ‌చ్చు, అలాగే రెండు జిల్లాల స‌రిహ‌ద్దులు మాత్రంమూసివేస్తారు వేరే వారికి ఎంట్రీ మాత్రం ఉండ‌దు.