బ్రేకింగ్ — వరంగల్ మేయర్ – ఖమ్మం మేయర్ వీరే

బ్రేకింగ్ -- వరంగల్ మేయర్ - ఖమ్మం మేయర్ వీరే

0
145

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అక్కడ గులాబీ పార్టీ జోరు చూపిస్తోంది, ఇటీవల గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి.. ఖమ్మం కార్పొరేషన్ లోనూ టీఆర్ ఎస్ సత్తా చాటింది, ఇక ఇక్కడ టీఆర్ ఎస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు చాలా ఆనందంలో ఉన్నారు. ఇక ఇక్కడ కార్పొరేషన్లలో మహిళలకు పెద్ద పీట వేశారు.

 

వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ఎన్నిక అయ్యారు.. ఆమె వరంగల్ 29వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించారు.

ఇక డిప్యూటీ మేయర్ గా రిజ్వానా షమీమ్ మసూద్ ఎన్నికయ్యారు. రిజ్వానా వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించారు.

 

ఇక మరో కార్పొరేషన్ ఖమ్మం.. ఇక ఖమ్మం కార్పొరేషన్ లో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు రెండూ మహిళలకే లభించాయి. ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రాలను ఎన్నుకున్నారు. నీరజ 26వ డివిజన్ ఫాతిమా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు. పార్టీ శ్రేణులు వీరి ఎంపికతో ఆనందంలో ఉన్నారు.