శుక్రవారం మధ్నాహ్నం నుంచి మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇక భాగ్య నగరం వర్షంతో తడిచి ముద్దైంది, అయితే
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇప్పటికే ప్రధాన రోడ్లు నీటితో మునిగిపోయాయి, అయితే ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంది, చిన్న పిల్లలను వృద్దులని బయటకు పంపకండి.. నాలాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి బైకర్స్ మ్యాన్ హోల్స్ దగ్గర నడిచివేళ్లేవారు జాగ్రత్తగా చూసుకోండి.
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కోఠి, ఖైరతాబాద్, అమీర్ పేట్, కూకట్ పల్లి , అబిడ్స్, రాజేంద్రనగర్, మణికొండ, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ లో భారీ వర్షం,
హస్తినపురంలో
కందికల్ గేట్
సరూర్‌నగర్‌లో
చార్మినార్ లో భారీవర్షం కురిసింది.