బ్రేకింగ్ — ఎయిర్ టెల్ కస్టమర్లకు హెచ్చరిక- ఈ లింకులు ఓపెన్ చేయవద్దు

-

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి… ఈ సమయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఎవరైనా ఫోన్ చేసి కార్డు డీటెయిల్స్ అడిగితే వాటిని చెప్పకూడదు. ఇలా చెబితే సెకన్ల వ్యవధిలో మన నగదు వారి ఖాతాల్లో ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు.. నగదు అంతా దోచేస్తున్నారు, ఇప్పుడు పలు కంపెనీల పేరు చెప్పి అనేక కాల్స్ వస్తున్నాయి.. ఇక మెసేజ్ లు చేసి పలు లింకులు ఓపెన్ చేయమంటున్నారు…సో అలాంటివి అస్సలు ఓపెన్ చేయకండి.

- Advertisement -

తాజాగా ఎయిర్ టెల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని.. వారిని కెవైసి (KYC) అప్డేట్ చేయాలని సందేశాలు పంపుతున్నారు సైబర్ కేటుగాళ్లు , ఇలా బురిడి కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు… అయితే మీరు ఇలా కేవైసీ చేయకపోతే మీ సిమ్ ఆగిపోతుంది అని చెబుతారు.. సో మీరు వెంటనే ఆ లింక్ ఓపెన్ చేస్తారు. ఇలాంటివి చేయకండి.

మీకు పంపిన లింక్ ఓపెన్ చేయగానే అది సరాసరి బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను అడుగుతుంది. ఆ తర్వాత రూ. 10 చెల్లిస్తే మీకు సేవలు వస్తాయి అని చెబుతారు. అలా చెల్లిస్తే మీ డీటెయిల్స్ అన్నీ వారికి వెళ్లిపోతాయి, జాగ్రత్త ఇలాంటి కేవైసీ లింకులు ఓపెన్ చేయవద్దు, ఏదైనా సమాచారం కావాలి అంటే నేరుగా ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అవ్వండి.

ఈ ట్వీట్ చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...