సీఎం కేసీఆర్ చెప్పింది చేస్తారు మాట ఇస్తే కచ్చితంగా అయ్యేదాకా వదలరు సీఎం కేసీఆర్.. అయితే ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాక అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు పూర్తి చేశారు, తెలంగాణలో పంటల సాగు మరింత పెంచారు, రైతులని ధనవంతులని చేస్తున్నారు ఆయన..
ప్రతీ గ్రామానికి తాగునీరు పంటలకు సాగునీరు అందించేలా బృహత్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ను, మర్కూక్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్… శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ రామానుజ స్వామి వారితో కలిసి ప్రారంభించారు, నేడు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సమయంలో మరో కీలక ప్రకటన చేశారు, మరో వారం రోజుల్లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్ను తెలంగాణ ప్రజలకు వినిపించ బోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. యావత్ తెలంగాణ రైతాంగం ఆనందలో ఉండే వార్త చెప్పబోతున్నాను అని తెలిపారు కేసీఆర్, ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారా అనే ఆతృత అందరిలో ఉంది.