బ్రేకింగ్ వైసీపీ మంత్రి రాజీనామా…. ?

బ్రేకింగ్ వైసీపీ మంత్రి రాజీనామా.... ?

0
81

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ఫైర్ అయ్యారు.. ఉచిత విద్యుత్ కు మంగళంపాడేస్తున్నారని ఆ పథకం ఎత్తేసేందుకే నగదు బదిలీ తీసుకువస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు…

తాజాగా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి పరిస్థితి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు… తమ పార్టీ రైతుల పార్టీ అని అన్నారు బాలినేని…

టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు… టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు..