బ్రేకింగ్ వైసీపీ మంత్రులు రాజీనామా….

బ్రేకింగ్ వైసీపీ మంత్రులు రాజీనామా....

0
98

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు… మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ అలాగే మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ పదవులకు ఈ రోజు రాజీనామా చేయనున్నారు… కాగా వీరిద్దరు ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే…

వీరు రాజ్యసభకు ఎన్నిక అయిన తర్వాత 14 రోజులలోపు తమ పదవులుకు రాజీనామా చేయాలి అందుకే ఈ రోజు వారిద్దరు అసెంబ్లీ కార్యదర్శికి తమ రిజైన్ లెటర్ ను అందించనున్నారు… ఆతర్వాత వీరు రాజ్యసభ తదుపరి సెషన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు…

కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి వీరిద్దరు ఓటమి చెందారు… జగన్ వీరికి ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి తన కేబినెట్ లో తీసుకున్నారు… తాజాగా వీరిద్దరిని రాజ్యసభకు పంపించారు…