బ్రేకింగ్ – వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్

బ్రేకింగ్ - వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్

0
72

ఏపీ తెలంగాణ‌లో కొత్త కేసులు బ‌య‌ట‌పడుతున్నాయి.. రోజుకి 600 కేసులు పైగానే రెండు చోట్ల కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. ఏకంగా తెలంగాణ‌లో ఎమ్మెల్యేల‌కు కూడా వైర‌స్ పాజిటీవ్ వ‌చ్చింది, ఇటు కాంగ్రెస్ నేత‌ల‌కు కూడా వైర‌స్ సోకింది, ఇప్పటికే ప‌లువురు చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఓ ప్రజాప్రతినిధికి కరోనా వైరస్ సోకింది. ఆయన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే. పేరు కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా ఎస్.కోట సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజా రిపోర్టులో ఆయ‌న‌కు వైర‌స్ పాజిటీవ్ అని తేలింది.

ఇక నాలుగు రోజులుగా ఒంట్లో న‌ల‌త‌గా ఉంది ..దీంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు, ఆయ‌న‌కు వైర‌స్ సోకింది అని తేలింది..చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్‌కు తరలించారు. ఆయ‌న గ‌న్ మెన్ కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు తెలుస్తోంది..ఈయన కొన్ని రోజుల క్రితం అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో అందరు విదేశీ ప్రయాణికులకు చేసినట్టే, ఆయనకూ వైద్య పరీక్షలు చేశారు. ఆయనలో వైరస్ లక్షణాలు అప్పుడు కనిపించలేదు. దీంతో ఆయ‌న‌ని క‌లిసిన వారు అంద‌రూ టెన్ష‌న్ లో ఉన్నారు.