అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు… మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు…
ఇటీవలే దేవగూడి గ్రామ సమీపంలో చోటు చేసుకున్న దాడిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆదినారాయణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఆయన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… కాగా రెండు రోజులక్రితం ఆదినారాయణ రెడ్డితోపాటు మరో 80 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే
కాగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆతర్వాత టీడీపీలోకి జంప్ చేశారు… 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు ఇటీవలే బీజేపీ తీర్ధం తీసుకున్నారు…