దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు అని అందరికి తెలిసిందే… ప్రస్తుతం కేవీపీ గురించి ఒక వార్త వైరస్ అవుతోంది.. ఇక నుంచి ఆయన ఏపీ రాజకీయాలను పట్టించుకోరని ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు పరిమితం అవుతారని వార్తలు వస్తున్నాయి…
ఇటీవలే కేవీపీ తాను తెలంగాణకు చెందిన వాడినని చెప్పడం కూడా ఇందుకు బలం చేకుర్చుతుందని కొందను చర్చించుకుంటున్నారు… ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు లేకపోయినా హైకమాండ్ వద్ద కమాండ్ ఉన్న నేతగా టీపీసీసీ నేతలు భావిస్తున్నారు… ఇటీవలే కేవీపి రామచంద్రరావు రాజ్యసభ్య పదవి కాలం పూర్తి అయింది…
ఇక యనకు ఇప్పట్లో రాజ్యసభ వచ్చే ఛాన్స్ లేదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికాంలో లేకపోవడంతో కేవీపీ రామచంద్రరావు ఇక పెద్దల సభకు ఎంపికయ్యే అవకాశం ఇప్పట్లో లేదనే అనిపిస్తుంది… అయితే ఎప్పటికైనా తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది… అందుకే కేవీపీ రామచంద్రరావు తాను తెలంగాణవాడినని చెప్పుకున్నారి కాంగ్రెస్ పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి… ప్రస్తుతం ఇదే కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా సాగుతోంది…