బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు…. కాని నెటిజన్లు ఏం చేశారంటే

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.... కాని నెటిజన్లు ఏం చేశారంటే

0
107

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇప్పుడు మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమితులు అయ్యారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ , బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు, ఇక అంత పెద్ద పదవికి మన భారతీయుడు వెళ్లడం నిజంగా ఓ గొప్ప కీర్తిగానే అందరూ చెబుతున్నారు.

రిషి సునక్ విషయంలో భారతీయ నెటిజన్ల స్పందన షాక్ ఇస్తోంది, అవును ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి స్టేజ్ కు వెళితే కచ్చితంగా వారి గురించి నెట్ లో సెర్చ్ చేయడం తెలిసిందే, ఆయన పేరు, ఎక్కడ పుట్టారు, ఏం చదివారు, వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇలా అన్నీ తెలుసుకుంటారు. ఆయన ఉద్యోగం చేశారా, వ్యాపారం చేశారా, ఆయన సాధించిన ఘనతలు తెలుసుకుంటారు.

కాని మన భారతీయులు చాలా డిఫరెంట్ గా ఆలోచించారట..అతని కులం ఏమిటి? అని భారతీయ నెటిజన్లు పెద్ద ఎత్తున గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంత మంది ఇలా సెర్చ్ చేశారు అనే నెంబర్ కూడా చెప్పింది గూగుల్, ఇలా లక్షల మంది సెర్చ్ చేశారట.