Breaking: దారుణం..టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ను హత్య చేసిన దుండగులు..

0
70

మహబూబాబాద్‌ జిల్లాలో కౌన్సిలర్‌పై దారుణం చోటు చేసుకుంది. 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరకి చంపారు. నిర్మానుషంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్‌పై దుండగులు దాడి చేసి పరారయ్యారు. అది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అనంతరం పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.