విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

0
89

లెక్కలు రాసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పిచ్చి గింజ చేసిన మీరు ఇన్కంట్యాక్స్ రైడ్స్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు

ప్రభుత్వ అధికారులతో సత్ప్రవర్తన గురించి మీరు చెప్తేనే మేము వినాలని. మీరు ఇలాంటి మాటలు చెప్తుంటే నవ్వాలో, ఏడవాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు అధికారులను జైలుకి పంపడం, ఊచలు లెక్కించేలా చెయ్యడం, దూషించడం, బెదిరించడం లాంటి ఘటనలు మీరు మర్చిపోవటం పెద్ద వింతేమీ కాదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు…

ఇంక డబ్బు లెక్కలు అంటారా.. మీకు తెలిసిన దొంగ లెక్కల్లో అంతర్జాతీయ ఆర్థిక తీవ్రవాదులకూ, మీకూ పోటీ పెడితే వాళ్ళు అందరూ మీకు పాదాభివందనం చేసి ఈ భూమినే వదిలి వెళ్లిపోతారని ఆరోపించారు…