ఒళ్లు జలదరించే వ్యాఖ్యలు చేసిన బుద్దా జగన్ ను అంతలా విమర్శించడం ఇదే తొలిసారేమో

ఒళ్లు జలదరించే వ్యాఖ్యలు చేసిన బుద్దా జగన్ ను అంతలా విమర్శించడం ఇదే తొలిసారేమో

0
126

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పలు విషయాలపై స్పందిస్తూ వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు… శకుని విజయసాయిరెడ్డి మామా ఏ ప్రశ్నకీ సమాధానం లేదు,సీబీఐ కోర్టు బెయిలు రద్దు చేసేలా ఉందని తెలిసి మాట పడిపోయిందా ప్రశ్నించారు.

పాపం పండే రోజు దగ్గరపడిందని వణుకు మొదలయ్యిందా? రేపో మాపో తుగ్లక్ జగన్ పెద్దల కాళ్లు పట్టడానికి ఢిల్లీ వెళ్తున్నాడని తెలిసింది, నువ్వింకా మొదలెట్టలేదా ప్రయత్నాలు అని బుద్దా విమర్శించారు. విజయసాయి రెడ్డి నీకు దమ్ముంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడు.

45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ,మద్యపాన నిషేధం అంటూనే వారి ఇళ్ల మధ్యలో మద్య దుకాణాలు తెరిచి మోసం చేసిన నిన్ను, నీ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారుని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న