గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల అసెంబ్లీకి ఆయన కుమార్తె అనురాధను ఇంచార్జిగా నియమించింది. దీంతో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.
మరోవైపు టీడీపీ కూటమి తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో దిగారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తాజాగా ఆయనను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం పోటీలో నిలిపింది. పొత్తులో భాగంగా అనకాపల్లి బీజేపీకి వెళ్లడంతో రమేష్ పేరును కమలం పెద్దలు ఖరారు చేశారు. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.