బుల్లెట్ కి ఏకంగా గుడి కట్టారు దీని వెనుక స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు

-

దేవుడికి గుడి కడతారు అని తెలుసు, లేదా అభిమానించి ఆరాధించే రాజకీయ నేతలకు, హీరోలకు, హీరోయిన్లకు గుడి కడతారు అనేది ఇటీవల మనం చూస్తున్నాం.. కొందరు జంతువులకి కూడా గుడి కట్టి ప్రాణాలు కాపాడాయి అని వాటిపై ప్రేమతో గుడికడుతున్నారు, అయితే ఇక్కడ విచిత్రంగా ఓ బుల్లెట్ బైక్ కి గుడి కట్టారు, ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గుడిలో బైక్ను కొలుస్తున్నారు ఇక్కడ జనం, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం,
అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. బుల్లెట్ 350 బైక్. మరి గుడి ఎక్కడ ఉంది అంటే, రాజస్థాన్లో జోద్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ గుడి ఉంది. మరి ఇక్కడ ఎందుకు గుడి కట్టారు ఏమిటి స్పెషాలిటీ అంటే చూద్దాం.
   ఇక్కడ చాలా మంది గుడికి వస్తూ ఉంటారు, ప్రమాదాలు జరుగకుండా కాపాడాలి అని మెక్కుకుంటారు..
ఈ టెంపుల్ను ఓమ్ సింగ్ రాథోర్ పేరుపై నిర్మించారు. ఆయన  బుల్లెట్ పై వెళుతున్న సమయంలో కింద పడి మరణించారు, అయితే అక్కడ నుంచి  బుల్లెట్ ను స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీసులు… కాని రాత్రి అక్కడ నుంచి మాయం అయింది.
ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడ ప్రత్యక్షమైంది.
పోలీసులు ఆశ్చర్యపోయారు. మళ్లీ బైక్ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. పెట్రోల్ తీసేసి మళ్లీ స్టేషన్ లో ఉంచారు..
అయినా రాత్రి అక్కడ నుంచి మిస్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలోనే గుడి కట్టారు, ఇలా ఇక్కడ ప్రమాదాలు జరుగకూడదు అని కొత్తగా బైక్ కొన్నవారు ఇక్కడకు వచ్చి పూజలు చేసి వెళతారు, ఇలా దేశంలో బైక్ కి గుడి  నిర్మించింది ఇది ఒక్కటే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...