టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Bumper offer for TS RTC employees

0
90

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’ విధానం వర్తింపజేయాలని నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా..అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌ కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈఓఎల్‌ కింద గరిష్టంగా ఐదేళ్ల పాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు.