ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం దారుణంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల ద్వారా వచ్చే పొల్యుషన్ దారుణంగా ఉంటోంది, ఇక చాలా దేశాలు ఇప్పటికే డీజీల్ పెట్రోల్ కాకుండా సోలార్ ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాల తయారీకి ఊతం ఇస్తున్నాయి, ఇక పాత వాహనాలను పక్కన పెట్టేస్తున్నారు, అయితే మన దేశంలో కూడా ఇటీవల.
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రకటించారు, ఇక కచ్చితంగా ఈ పాలసీ ప్రకారం 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు చేయాల్సిందే. పాత వాహనాలు రోడ్లపై ఇక తిరిగే ఛాన్స్ ఉండదు, 8 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ కూడా పడుతుంది.
ఇక ఇలా వాహానాలు తుక్కుకు వెళ్లాల్సిందే, అయితే ఇలాంటి వాహనాలు స్క్రాప్ కు ఇచ్చేస్తే ఇక కొత్త వాహనాలు తీసుకుంటే వారికి మరింత రాయితీలు ప్రయోజనాలు వచ్చేలా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. త్వరలోనే ఈ పాలసీ విధివిధానాలు ప్రకటిస్తారు.