భీమ్లానాయక్ మొగులయ్యకు బంపర్ ఆఫర్

Bumper offer to Bhimlanayak Mogulayya

0
88

మొగులయ్య..ఈ పేరు వినగానే మొదటగా మనకు బీమ్లానాయక్ పాట గుర్తొస్తుంది. ఈ పాట అంతలా ఆకట్టుకుంటుంది మరి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీలోని పాటను కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ పాటతో మొగులయ్య ఎంతో ఫేమస్ అయ్యాడు కూడా. ఇక ఇప్పుడు మొగులయ్యకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

అసలు విషయం ఏంటంటే..ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో కిన్నెర మొగులయ్య సమాజంతో బస్సులకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ కిన్నెర వాయిద్యంతో మంచి పాట పాడారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలువురు ఈ వీడియోని టిఎస్ ఆర్టిసి అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఆర్టీసీ గురించి సానుకూల ప్రచారం చేసినందుకుగాను మొగులయ్యను ఆర్టీసీ ఎండి సజ్జనార్ సన్మానించారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కిన్నెర మొగుల‌య్యకు ఆర్టీసీ బ‌స్సుల‌లో ఉచితంగా ప్రయాణించే అవ‌కాశం కల్పించారు. అలాగే కిన్నెర మొగులయ్య పాడిన ఆర్టీసీ పాట వీడియో కు సోష‌ల్ మీడియాలో లక్షలలో వ్యూస్, లైక్ లు వ‌చ్చాయి. ఆర్టీసీ నిర్ణయంపై మొగులయ్య సంతోషం వ్యక్తం చేశాడు.