భూములు కొన్న వైసీపీ నేతలు వీరే… ఎరిపేరుమీద ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా

భూములు కొన్న వైసీపీ నేతలు వీరే... ఎరిపేరుమీద ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా

0
72

రాజధానిలో ఉద్యమం రోజు రోజుకు తీవ్రం అవుతుండటంతో వైసీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని డ్రామాలకు తెర తీస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు…. అపద్దాన్ని పదే పదే మీడియా ద్వారా వివరించి దాన్ని నిజం చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు..

ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేశారు… అంతేకాదు ఈ అంశంపై తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.. ఈరోజైనా రేపైనా సరే అని సవాల్ విసిరారు ఉమా… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైసీపీ నాయకులు కూడా రాజధానిలో భూములు కొన్నారని వాటికి సంబంధించిన వివరాలు కూడా మీడియాకు తెలిపారు ఆయన…

నంబూరు శంకరావు 5 ఎకరాలు ఉండవల్లి శ్రీదేవి తన భర్త పేరున రెండు ఎకరాలు కొన్నారని ఉమా తెలిపారు… అలాగే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నీరుకొండలో 5 ఎకరాలు, బ్రహ్మయ్య 34 ఎకరాలు ఏసురత్నం బొల్ల బ్రహ్మనాయుడు కూడా అమరావతిలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు…

వైసీపీనాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసి అమరావతిని తరలించాలని చూస్తున్నారని ఉమా ఆరోపించారు… అలాగే వైసీపీ నాయకులు పవన్ ను విమర్శించే అర్హత లేదని అన్నారు…