ఛార్జీల పేరుతో దొంగ చాటు భారం..పిటిషన్ దాఖలు చేసిన బోరెడ్డి అయోధ్య రెడ్డి

Burden of burglary in the name of charges: Boreddy Ayodhya Reddy

0
144

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి & సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయి.

పేద, మద్య తరగతి కుటుంబాలపై ఎక్కువ కరెంటు భారం ఛార్జీలు పెంపుతో 7 వేల కోట్ల భారం పేద, దిగువ మధ్యతరగతి ప్రజల మీద మోపుతోంది. కస్టమర్ చార్జీల పేరుతో దొంగ చాటు భారం మోపుతోంది. తక్కువ విద్యుత్ వాడే వారిపై ఎక్కువ భారం మోపే పనిలో పడింది ప్రభుత్వం. ఏడెళ్ళలో 40 వేల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలపై పడింది. ఎక్కడ లేని ఎక్కువ ధరలకు విద్యుత్ ఎక్కువ మొత్తంతో కొని అప్పుల పాలు చేసింది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఎక్కువ ధరలకు కొని నష్టాలకు కేసీఆర్ కారణం అని అన్నారు.

విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలకు, చార్జీలు పెంచడానికి కారణాల మీద శ్వేత పత్రం విడుదల చేయాలి. పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయి. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుంది. 51-100 యూనిట్లు వాడే వినియోగదారుల మీద 39.50 శాతం భారం 800 యూనిట్లకు పైగా విద్యుత్ ను వాడే వినియోగదారుల మీద 8.9 శాతం మాత్రమే అదనంగా భారాన్ని మోపుతున్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం. 72.50 రూపాయల చార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి 112.50 చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు 55 రూపాయలను కనీస ఛార్జి ఉంది.

అది వచ్చే నెల నుంచి 150 రూపాయలు చెల్లించాలి. ఇది 173 శాతం అదనంగా పెంచారు. తక్కువ ధరతో రామగుండం ప్లాంటు నుంచి కొనడం ఆపేసి భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నుంచి ఎక్కువ ధరకు కొంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. విద్యుత్ 84,222 మిలియన్ యూనిట్లు అవసరం అని పంపిణీ సంస్థలు అంటున్నాయి. గత ఏడాది కన్నా ఇది 16.69 శాతం ఎక్కువ. ఇంత విద్యుత్ వినియోగం ఉండదు. జెన్ కో సంస్థలు కేవలం 55 శాతమే సామర్ధ్యం ఉత్పత్తి చేస్తున్నది. ఉత్పత్తి సామర్ధ్యము పెంచితే కొనాల్సిన అవసరం తక్కువ. 698 విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. దీనికి 529 కోట్లు పరిహారం. భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఈ దారుణం జరుగుతుందని బోరెడ్డి అయోధ్య రెడ్డి  ఆరోపించారు.