కోడిపుంజుకి బస్ టికెట్..స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Bus ticket for Kodipunju..RTC MD Sajjanar who responded

0
106

సాధారణంగా మనం బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటాం. మనతో చిన్నపిల్లలు ఉంటే వారికి హాఫ్ టికెట్ తీసుకుంటాం. ఒకవేళ పరిమితికి మించిన లగేజీ ఉంటే దానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. కోడిపుంజుకు కూడా టికెట్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా?  ఇప్పడిదే తెలంగాణలో హాట్ టాపిక్. ఎంతలా అంటే ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వరకూ వెళ్లేంత.

అసలేం జరిగిందంటే?

అలీ అనే వ్యక్తి రామగుండం సమీపంలో కోడిపుంజుతో కరీంనగర్ కు వెళ్తున్నబస్సులో ఎక్కాడు. అయితే బస్సు సుల్తానాబాద్ చేరుకున్న సమయంలో కండక్టర్ కి కోడి కూత వినిపించింది. అప్పుడు కండక్టర్​ ఆ ప్రయాణికుడ్ని టికెట్ తీసుకోమని అడిగాడు. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ న్యూస్ రిపోర్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ తీసుకోమని పదే పదే చెప్పాడు.

దాంతో ప్రయాణికుడు కోడిపుంజుకి రూ.30 టికెట్ ఆ ? అని అడగ్గా.. ప్రాణంతో ఉండే ప్రతి జీవికి టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పాడు. దీంతో అతనితో పాటు బసులోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు. కోడిపుంజుకు ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఓ సోషల్ మీడియా వేదికగా తెలిజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ ప్రకటించారు.