2020 వీరిద్దరూ మరింత కుబేరులు అయ్యారు

-

కరోనాతో గత ఏడాది మార్చి నుంచి అన్నీ రంగాలు దెబ్బతిన్నాయి, మన దేశంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. వ్యాపారాలు కూడా 90 శాతం డౌన్ అయ్యాయి అని చెప్పాలి, కోట్లాది ఉద్యోగాలు కోల్పోయారు, అయితే కొన్ని దేశాల్లో ధనవంతుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. 2020లో వారికి సిరుల పంట పండింది. ముఖ్యంగా అమెరికాలో చాలా మంది ఈసారి మరింత కుబేరులు అయ్యారు.

- Advertisement -

కొందరు బిలియనీర్లు 2020లో ఏకంగా ట్రిలియన్ డాలర్ల సంపదను తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ లాక్ డౌన్ వేళ అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మరింత కుబేరుడు అయి మొదటిస్ధానంలో ఉన్నారు వరల్డ్ రిచెస్ట్ పర్సెన్ గా…ఇక టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బాగా లాభాలు పొంది తన ఆస్తి పెంచుకున్నారు.

2020లో మస్క్ సంపద ఏకంగా నాలుగింతలైంది. ఒక్క ఏడాదిలోనే 132 బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరింది. ఇక వరల్డ్ లో రెండస్ధానంలో మస్క్ చేరారు ధనవంతుల జాబితాలో. ఇంత ధనం రావడానికి కారణం వారికి చెందిన కంపెనీల షేర్ల ధరలు పెరగడమే. మస్క్ స్థాపించిన వాహన తయారీ సంస్థ టెస్లా షేర్లు 800 శాతం పెరుగుదల నమోదు చేశాయి…ఇక అమెజాన్ షేర్లు 2020లో 70 శాతం పెరిగాయి. కరోనా సమయంలో అమెజాన్ వెబ్ భారీ లాభాలు తెచ్చింది, అంతేకాదు షట్ డౌన్ కారణంగా ఇంటికి నేరుగా అమెజాన్ ద్వారా సర్వీసులు వస్తువుల డెలివరీ జరిగాయి , వీరిద్దరూ 200 బిలియన్ డాలర్లు సంపద పెంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక...