ఈ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..షెడ్యూల్ జారీ..ఫలితాలు ఎప్పుడంటే?

0
88

5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వాడీవేడి ఇంకా తగ్గలేదు. ఫలితాలు వచ్చిన ప్రతిపక్ష పార్టీలు గెలిచిన పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. మళ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానుంది. మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

పశ్చిమ బెంగాల్ లో అసన్ సోల్, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానాలకు, చత్తీస్గడ్ లో ఖైరా ఘర్, బీహార్ బొచా హన్, మహారాష్ట్ర కొల్హాపూర్ నార్త్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 17న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవ్వనుండగా… మార్చి 24 వరకు తుది గడువు ఉండనుంది.

నామినేషన్లకు తుది గడువు మార్చి 28 కాగా.. పోలింగ్ ఏప్రిల్ 12న జరుగనుండగా.. ఏప్రిల్ 16న కౌంటింగ్ జరుగనుంది. కాగా అనర్హత లేక, ఎమ్మెల్యే అభ్యర్థి మరణించడం, లేకపోతే రాజీనామా చేయడం వంటి కారణాల వల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. తాజాగా వాటికి ఉపఎన్నికలు జరగనున్నాయి.