ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి మండలి ప్రగతి భవన్ లో సమావేశమైంది. పలు అంశాలమీద సుధీర్ఘంగా చర్చించిన కేబినెట్ అందుకు సంబంధించి కొత్త ఆసుపత్రుల నిర్మించాలని నిర్ణయాలు తీసుకున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ రాష్ట్రానికి మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నూతనంగా మంజూరు చేసింది.
వీటిలో ఎర్రగడ్డ చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి అవుటర్ రింగు రోడ్డు మధ్యలో మూడవది. టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది.