ఇవాళ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Cabinet meeting today .. Chance to take key decisions

0
88

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన..మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది.

ప్రస్తుత వానాకాలంలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం సహా యాసంగిలో ఎంత తీసుకుంటారో చెప్పాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్రమంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదన్న కేంద్రం… ఎఫ్​సీఐ  చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా యధాతథంగా కొనుగోళ్లు చేస్తామని తెలిపింది.

ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లు సహా యాసంగి సాగుపై మంత్రివర్గ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించనున్నారు. కేంద్రం సూచనల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోంది. అన్ని అంశాలపై కేబినెట్‌లో చర్చించి… యాసంగిలో పంటల సాగు విధానాన్ని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.