2019 ఏపీలో ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు . ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఇచ్చిన అన్నీ హామీలు కూడా నెరవేర్చారు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయబోతున్నారు. వారిద్దరిని తాజాగా ఆయన రాజ్యసభకు పంపారు, దీంతో రాజీనామాలు చేశారు.
ఇక వారు త్వరలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చేది శ్రావణ మాసం ముఖ్యంగా 21న ఇది స్టార్ట్ అవ్వనుంది, అయితే 22 ముహూర్తం బాగుంది అని ఆరోజు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.