ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణంతో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా..పోలింగ్ కోసం 279 కేంద్రాల ఏర్పాటు చేశారు.
వైకాపా తరఫున మేకపాటి విక్రమ్‌రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్ యాదవ్, మరో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా ఆత్మకూరులో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 24.92 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి.