మొత్తానికి తెలంగాణలో సీఎంగా కేటీఆర్ అంటూ గత నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది…దీనిపై ఆదివారం క్లారిటీ వస్తుంది అని మీడియాలో వార్తలు వచ్చాయి… అయితే బయట జరుగుతున్న ప్రచారం పై సీఎం కేసీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశంలో ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడారు.
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని ఆయన స్పష్టం చేశారు, ఆయన నేరుగా ఈ ప్రకటన చేయడంతో క్లారిటీ వచ్చింది, ఏప్రిల్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. ఏ జిల్లా ముందుకి వస్తే ఆ జిల్లాలో
భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. 6 లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాలన్నారు.
ఈనెల 12 నుంచి సభ్యత్వ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 1 నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్ది ఎవరు అనేది సీల్డ్ కవర్లో ఇస్తామని తెలిపారు… ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు.