భార్యాభర్తలు ఇద్దరు పీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చా?

0
110

చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రతి 4 నెలలకు రూ.2000 రైతు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 విడతలుగా రైతు ఖాతాకు డబ్బులు చేరగా త్వరలో 10వ విడత రైతు ఖాతాలో జమ కానుంది.

ఈ స్కీం కింద భార్యాభర్తలిద్దరు అప్లై చేసుకోవచ్చ అని డౌట్. పీఎం కిసాన్ యోజన నియమాల ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు. ఎవరైనా ఇలా చేస్తే ప్రభుత్వం అతడి నుంచి డబ్బులు రికవరీ చేస్తుంది. అతడ్ని ఫేక్ అంటోంది. అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వారు అన్ని వాయిదాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి.

రైతు తన వ్యవసాయ భూమిని వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా ఇతర పనులకు వినియోగిస్తే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులు కారు. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే అతడికి ఈ పథకం ప్రయోజనం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా పదవీ విరమణ చేసిన, సిట్టింగ్ లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయితే అలాంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులే.