కొత్త ఏడాది వస్తూనే మనకు గుడ్ న్యూస్ తీసుకువచ్చింది…మనదేశంలో కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. అత్యవసర సమయంలో వాడకానికి కోవిషీల్డ్ , కోవాగ్జిన్ వ్యాక్సీన్ల వినియోగానికి అనుమతి ఇచ్చారు, దీంతో వీటిని ప్రజలకు అందివ్వనున్నారు, అయితే ఇలాంటి వేళ కొందరు రాజకీయ నేతలు మాత్రం దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ టీకా సురక్షితం కాదని కామెంట్లు చేస్తున్నారు.
ఇలా అనేక కామెంట్లు పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్న సమయంలో, వ్యాక్సీన్ల భద్రతపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) స్పష్టతనిచ్చారు. మేము ఏదైనా సరే కచ్చితంగా భద్రతా ప్రమాణాలు పరిశీలించి అనుమతి ఇస్తాం.. వాక్సిన్ సురక్షితం అని తెలిపింది, బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు.
ఏ వ్యాక్సీన్ తీసుకున్నా జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్వ సాధారణంగా కొందరిలో కనిపిస్తాయి, అయితే ఇటీవల
వ్యాక్సీన్ తీసుకుంటే పురుషుల్లో నపుంసకత్వం వస్తుందని ప్రచారం జరుగుతోంది, ఇందులో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది.