మన దేశంలో అన్నీ రాష్ట్రాలు కూడా పేద ప్రజలకు రేషన్ కార్డులు అందచేస్తున్నాయి… తెల్లరేషన్ కార్డుల ద్వారా పేదలకు చౌక ధరలకే రైస్ గోదుమలు సబ్బులు సాల్ట్ ఇలాంటి అనేక వస్తువులు ఇస్తున్నారు.. ఇక అనేక స్టేట్స్ లో పప్పు ధాన్యాలు కూడా ఇస్తున్నారు… అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా, వారు ఎక్కడ నివశిస్తున్నా వన్ నేషన్ వన్ రేషన్ విధానంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు.
అయితే చాలా మందికి ఈ విషయం తెలియాలి… రేషన్ కార్డులో కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు అంటే , అందులో ఎవరైనా మరణిస్తే ఆ కార్డులో ఉన్న వారు ఇక ముగ్గురు మాత్రమే …అంటే చనిపోయిన వారి పేరు మీద రేషన్ తీసుకోకూడదు, ఇది కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి అంటున్నారు అధికారులు.
ఇలా మరణించిన వారి వివరాలు తెలియచేయాలి, ఈ సమయంలో కార్డులో ఉన్న అతని పేరు తొలగిస్తారు.. మిగిలిన ముగ్గురికి కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుంది వారికి రేషన్ అందిస్తారు .. అయితే ఆవ్యక్తి మరణించాక అతని రేషన్ కార్డును వినియోగించి సరుకులు తెచ్చుకున్నా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఇది కచ్చితంగా గుర్తు ఉంచుకోండి, అయితే మరి ఎలా ఈ పేరు తొలగించాలి అంటే, రేషన్ షాపు డీలర్ ని సంప్రదించవచ్చు, అలాగే స్ధానిక ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లవచ్చు.