తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై ఇటీవల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్‌కర్నూలు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా, మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా పోలీసులపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అపుడు పోలీసుల బట్టలు విప్పుతాం అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను రేవంత్ వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే రేవంత్ రెడ్డిపై నిరసనగా పోలీసుల ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అవసరమైతే రేవంత్‌కు బందోబస్త్‌ను సైతం విరమించుకుంటామని స్పస్టం స్పష్టం చేశారు. అయితే, పోలీసుల హెచ్చరికలను రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.