నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దీనితో నేడు ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ నేతలపై పోలీసులు సీరియస్ అయ్యారు. బాధిత ఎస్సై ఫిర్యాదుతో రేణుకాచౌదరిపై ఐపీసీ 353 సెక్షన్ కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.