మరో వివాదంలో మంత్రిపై కేసు నమోదు..

0
92

సాయిగణేశ్ ఆత్మహత్య కేసులో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.  ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని పీజీ విద్యార్థుల స్టైఫండ్ రాకుండా చేసి మాకు అన్యాయం చేస్తున్నారని దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకు ఈ విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. వారిని మంత్రి పదవి నుండి తొలగియాలని తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.