Breaking News- టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

0
85

తెలంగాణ: టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యపై కేసు నమోదయ్యింది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే రాజయ్య రాష్ట్ర మహిళలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని వారు ఈ సందర్బంగా హెచ్చరించారు.

కాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  సీఎం కేసీఆర్ ను ప్రస్తావిస్తూ..కొత్త చీరలు అయ్య అవ్వలు తెస్తలేరు. భర్త తేవట్లేదు. అత్తమామలు కూడా తేవట్లేదు..కాని అమ్మ అయ్యా కేసీఆర్ ఐతుండు..అత్తామామ ఐతుండు..భర్త కూడా అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.