Breaking News- మంత్రి మల్లారెడ్డి మీద దాడి ఘటనపై 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు-వీడియో

0
93

తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల పోలీసులకు పిర్యాదు చేసారు. దాంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు టీఆర్‌ఎస్ నేతల పిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై 173, 147, 149, 341, 352, 506 అనే 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు..ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌లో సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి అనే ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు కూడా నమోదు చేసారు. ఈ ఘటనకు రేవంత్‌రెడ్డి అనుచరులే కారణమని టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/GzuUOLGwyGg