మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ వ్వక్తే కీలక సాక్షా ?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తులకు సీబీఐ నోటీసుల జారీ

0
91

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. ఈరోజు వివేకా మాజీ కారు డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు.

గత ఏడాది విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో వారు విచారణను తాత్కాలికంగా నిలిపేసి తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. మళ్లీ నేటి నుంచి తిరిగి విచారణ ప్రారంభించారు. ఇదివరకే పలువురు కీలక వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిని విచారించే అవకాశముంది.