మన దేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికి శ్మశానవాటికలు లేవు అని ప్రభుత్వానికి గ్రామాల్లో చాలా మంది అర్జీలు పెట్టుకుంటారు, మరి ఇలాంటి సమయంలో ఓ వార్త మాత్రం వినిపిస్తోంది, ఎంతో గారంగా ముద్దుగా ప్రేమించి పెంచుకునే కుక్కలకి ఏకంగా శ్మశానవాటికని ఏర్పాటు చేశారు, ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కుక్కల కోసం ఓ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఘిటోర్నిలో నగవాసుల పెంపుడు కుక్కలు మరణిస్తే వాటి కళేబరాలను దహనం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ శ్మశానవాటికను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఇక అంతిమ సంస్కారాలు వాటికి ఇక్కడే చేస్తారు, ఇక్కడ గంటసేపులో ఆ కుక్కలకి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. శ్మశానానికి చుట్టూ పచ్చదనంతో నిండేలా మొక్కలు పెంచారు
నగరంలో గాయపడిన కుక్కలకు చికిత్స కోసం తీసుకువెళ్లడానికి డాగ్ రెస్క్యూ అంబులెన్సు కూడా ప్రారంభించారు.