మీకు ఆధార్ కార్డ్ ఉందా అయితే బిగ్ న్యూస్ వదిలిన కేంద్రం

మీకు ఆధార్ కార్డ్ ఉందా అయితే బిగ్ న్యూస్ వదిలిన కేంద్రం

0
97

మన దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి అన్నా అలాగే బ్యాంక్ అకౌంట్, ఎన్నికల గుర్తింపు కార్డు అలాగే రేషన్ కార్డు ఏది కావాలి అన్నా కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.. మరి మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు గతంలో లా ఆధార్ లో మార్పులు చేర్పులు కుదరవు అని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీంతో మళ్లీ అప్ డేట్ చేసుకోవాలని అనుకునే వారికి ఇది కుదరని పని అని చెప్పాలి.

మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి అంశాలకు సంబంధించి రూల్స్ కూడా మారాయి. మీరు కేవలం రెండు సార్లు మాత్రమే మీ ఇంటి పేరు తప్పులు ఒప్పులు మార్పు చేసుకోగలరు.. అంతేకాదు మొదటి సారి ఎన్ రోల్ మెంట్ చేసుకున్న తర్వాత కేవలం ఒకసారి మాత్రమే మీకు పేరు మార్పు అవకాశం ఉంటుంది…. రెండు సార్లు అయిపోతే మీరు మళ్లీ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు..ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కేవలం ఒకేసారి మార్చుకోగలం. అలాగే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో రికార్డైన పుట్టిన సంవత్సరానికి మూడేళ్లు పైకి లేదా కిందకు మాత్రమే మార్చుకోగలం.

పుట్టిన తేదీ మార్చుకోవడానికి కచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. లేదంటే మార్చుకోవడం వీలు కాదు.
జెండర్ వివరాలను కూడా కేవలం ఒకేసారి అప్‌డేట్ చేసుకోగలం.
లిమిట్ దాటి మార్పు చేసుకోవాలంటే యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే పరిమితి దాటిన తర్వాత కూడా మళ్లీ ఆధార్ అప్‌డేట్‌ ఎందుకు అవసరమైందో తెలియజేస్తూ help@uidai.gov.in కు మెయిల్ పంపాలి. ఆధార్ లో చాలా మంది ఇలా మార్పులు చేర్పులు చేసుకుని కొన్ని పథకాలు అవసరం లేకపోయినా పొందుతున్నారు.. అలాడే కొన్ని వయసు మాత్రమే మార్చి పథకాలకు అప్లై చేస్తున్నారు అని కేంద్రం గుర్తించింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.