కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ..ఆ అర్హత లేదంటూ..

0
90

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని ప్రకటన చేసింది. 2016, 2018లో సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటన చేశారు. అందువల్ల ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు స్కీం లో చేర్చడానికి అర్హత లేదని తేల్చి చెప్పారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలి. హై పవర్‌ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.