మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఏకంగా 90 వేల కేసులు నమోదు అయిన పరిస్దితులు చూశాం.. నేడు పది నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు తాజాగా కరోనా ఆంక్షలను మరింత సడలించింది కేంద్రం.
సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్ అందించింది తాజాగా. ఇక కంటెయిన్ మెంట్ జోన్ల వెలుపల అన్నీ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇక ఈ కొత్త నిబంధనలు ఫ్రిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.
సినిమా హాళ్లు, థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడుపుకోవచ్చు, ఇక ఇప్పటి వరకూ చూశాం 50 శాతం మాత్రమే పర్మిషన్ ఉంది.. సో ఇక ఫ్రిబ్రవరి 1 నుంచి 100 శాతం సిట్టింగ్ తో ప్రదర్శనలు చేసుకోవచ్చు..
అలాగే స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఇక ఫ్రిబ్రవరి ఒకటి నుంచి
ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.. ఇక దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఎలాంటి ఈ పర్మిట్లు అవసరంలేదు , బయటకు మాత్రం మాస్కులు ధరించి మాత్రమే రావాలి.