ఈ కరోనా సమయంలో చాలా రంగాలు దెబ్బ తిన్నాయి, ఆర్ధిక వ్యవస్ధ అత్యంత దారుణమైన స్దితికి చేరింది, అయితే ఏ రంగం చూసినా ఉపాధి లేదు పనిలేక చాలా మంది పస్తులు ఉన్నారు, సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు.
మార్చి నుంచి ఆగస్టు వరకూ వివిధ రకాల రుణాల ఈఎంఐలను మారటోరియం అవకాశం కల్పించింది ఆర్బీఐ, తాజాగా వీటిపై వడ్డీపై వడ్డీ చక్రవడ్డీ కూడా పడింది, ఈ సమయంలో ఇది చెల్లించాలా లేదా అనేదానిపై ఆలోచన ఉంది.. కస్టమర్లపై ఇది భారీగా భారం పడుతుంది అని ఎంతో బాధపడ్డారు.
ఈ సమయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇది విద్య, వాహన, వ్యక్తిగత, గృహ రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు, ఎంఎస్ఎంఈలకు వర్తిస్తుందని తెలిపింది.
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారిలో అత్యధికులు మారటోరియంను వినియోగించుకున్నారు, కొందరు ఈఎంఐ కూడా చెల్లించారు..రూ.6,500 కోట్ల భారం ఖజానాపై కేంద్రానికి పడుతుంది.మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించిన వారు, ఆయా వివరాలతో కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ ను పొంది ఉపశమనం పొందవచ్చు.