కేంద్రం కీలక నిర్ణయం..అసదుద్దీన్​ ఒవైసీకి జెడ్​ కేటగిరీ భద్రత

0
85

ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీకి జెడ్​ కేటగిరీ(సీఆర్​పీఎఫ్​) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై గురువారం రోజు కాల్పులు జరిపారు దుండగులు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.