చాలా చోట్ల సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు అని అయితే కొందరు మాత్రమే ఇలా ఉంటారు ( అందరూ ఉండరులేండి) ఇక కొందరిని అయితే లంచం లేనిదే పని చేయరు అంటకదా అని ప్రశ్నిస్తూ ఉంటారు, ఇక ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇలాంటి వ్యవహారాలు కొందరు చేస్తున్నారు, కంపెనీలకు ఎగనామం పెడుతూ,
చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.
ఇక వీటికి కేంద్రంచెక్ పెట్టనుంది, ఇకపై ప్రభుత్వ– ప్రైవేటు ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనల్లో పెను మార్పులనే తీసుకొచ్చింది. ఆఫీసుల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో పని చేయకుండా నిద్రపోతే అది బాధ్యతారాహిత్యం వారిపై చర్యలు తీసుకుంటారు.
ఇక సరైన సమయానికి రాకపోయినా
పై అధికారుల మాట వినకపోయినా చర్యల తీసుకోవచ్చు
ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకపోతే విచారణకు ఆదేశించవచ్చు.
లంచాలు తీసుకోవడం
ఆఫీసులో దొంగతనానికి పాల్పడటం
అనారోగ్యం లేకున్నా కూడా అబద్ధం చెప్పి విధులకు రాకపోవడం
ఇక కొందరు మందు తాగి ఆఫీసుకి వస్తారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటారు
వీటిల్లో ఏ ఒక్క దాన్ని ఉల్లంఘించినా అతడిపై చర్యలు తీసుకోవచ్చునని కేంద్రం కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది.