తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యథావిధిగా ధాన్యం సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు ఆందోళనలు చేపడుతున్న వేళ కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వేర్వేరు వాదనలు రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి.