2000 నోటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

2000 నోటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
71

కొద్ది రోజులుగా కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి…సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అయింది.. అయితే ఉన్నత అధికారులు బ్యాంకు సిబ్బంది చెప్పినా చాలా మంది వినిపించుకోలేదు.. ఇంట్లో ఉన్న రెండు వేల కాగితాల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నారు, ఎవరైనా రెండు వేలు నోటు ఇస్తే వద్దు అని చెప్పేవారు.

అయితే ఈ వార్తలకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెరదించారు. కేంద్రం దగ్గర అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు… అయితే కేంద్రం కావాలనే రెండు వేల నోట్లు తీసుకువచ్చి ఇవి మార్కెట్లో బాగా చెలామణి అయిన తర్వాత రద్దు చేస్తారు అని అనుకున్నారు, అప్పుడు నల్లధనం బయటపడుతుంది అని చాలా మంది భావించారు.

అయితే ఈ పుకార్లకు కారణం కూడా ఉంది .. ఇటీవల రెండు వేల నోట్లు పెద్దగా చెలామణిలో లేవు దీంతో ఇక నోట్లు రద్దు అవుతాయి అని అందరూ భావించారు.. కాని కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో మధ్యతరగతి పేద వారు చాలా మంది హమ్మయ్య అనుకుంటున్నారు, అయితే ఇలాంటి వార్తలు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేవరకూ ఎవరూ నమ్మకూడదు.