తెలంగాణకు పెనుభారంగా కేంద్రం నిర్ణయాలు..రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం

Central decisions as a heavy burden on Telangana .. additional financial burden on the state

0
90

యావత్ భారతదేశంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ అందించే రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ సర్కార్ కు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారంగా మారాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి 12,185 కోట్ల నష్టాలతో ప్రారంభమైన డిస్కంలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుభారంగా పరిణమించాయి.

తమస్సుల నుండి ఉషస్సులు ఉద్బవించేలా రాష్ట్రాన్ని కాంతి వంతం చేస్తామంటూ పట్టు పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్ సరఫరా అందించిన రాష్ట్రంగా సంచలనం సృష్టించిన తెలంగాణ సర్కారుకు విద్యుత్ సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ భారీ షాక్ నే ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. గ్రీన్ ఎనర్జీ పేరుతోటి టన్నుకు 50 రూపాయలు ఉండే క్లిన్ ఎనర్జీ సెస్ ను ఒక్కసారిగా 400 కు పెంచడంతో గడిచిన ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పై 7,200 కోట్ల అదనపు భారం మోపింది. తెలంగాణ డిస్కమ్ లు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి 50 వేల మిలియన్ యూనిట్లను ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తుంది.

అంతటితో ఆగని మోడీ సర్కార్ బొగ్గు ధరలను సాలీనా ఆరు నుండి పది శాతం మేర పెంచడంతో అదనంగా ప్రతి సంవత్సరం 725 కోట్లు భారం డిస్కమ్ లపై పడుతుంది. దీనికి తోడు బొగ్గు రవాణా ఖర్చులు కుడా తడిసి మోపెడు అవుతున్నాయి. గడిచిన నాలుగు ఏండ్లలో బొగ్గు రవాణా రైల్వే ఛార్జీలు 40 శాతం మేర పెంచడంతో వాటిని ఏ రకంగా పూడ్చుకోవలో తెలియక డిస్కమ్ లు ఆందోళన చెందుతున్నాయి. రెన్యుబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ పాలసీని తప్పనిసరి చేయడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల పిఎల్ఎఫ్ లపై భారీగా ప్రభావం చూపింది. అంతకు ముందే రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణా విద్యుత్ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడింది. తెలంగాణ సంస్థలు ఈ లోటును పుడ్చడం కోసం బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థలపై 2763 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది.

ఇతర ఏపి జెన్కో ఉత్పత్తి సంస్థల నుండి రావాల్సిన విద్యుత్ ను నిలిపి వేయడంతో తెలంగాణా సంస్థలు 2502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చింది. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తెలంగాణాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా వాటన్నింటినీ తట్టుకుంటూనే ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఎక్కడ రాజీ లేకుండా అన్ని వర్గాల వినియోగదారులకు కులమతాలకు అతీతంగా సబ్సిడీ తో నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తుంది. అందులో ప్రధానంగా ఒక్కో వ్యవసాయ పంపుసెట్ కు ప్రతి సంవత్సరం 18,167 రూపాయల సబ్సిడీ ఇస్తూ నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తూ రికార్డ్ సృష్టించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ మోటర్ల కనెక్షన్లు ఉండగా గడిచిన ఏడూ సంవత్సరాల్లో 6.89 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడంతో మొత్తం వ్యవసాయపు కనెక్షన్ల మీదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 3,375 కోట్లు ఖర్చు పెట్టింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 3,200 కోట్లు ఖర్చు చేస్తుంది. అదే విదంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే గృహ వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ప్రతి సంవత్సరం 1253 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.

ప్రత్యేకించి 101 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే ఎస్సి, ఎస్టీ గృహ వినియోగదారులకు పూర్తి ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నది. ఈ పధకం ద్వారా 5,77100 లక్షల యస్ సి వినియోగదారులు, 2,69983 యస్ టి వినియోగదారులు లబ్ది పొందుతున్నారు. అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు నిర్వహించే 15,046 వేల హెయిర్ సెలూన్ లకు 250 యూనిట్ల మేర నెల ఒక్కింటికి ఉచిత విద్యుత్ ను అందిస్తున్న విదితమే. అదే విదంగా 50 దోబీఘాట్లకు, 47545 లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తుంది. వీటికి తోడు 4920 పవర్ లుమ్ వినియోగదారులకు,5920 కోళ్ళ ఫారాలకు 36 స్పిన్నింగ్ మిల్స్ కు యూనిట్ ఒక్కింటికి రెండు రూపాయల సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూ వ్యవసాయానికి నిరంతర ఉచిత నాణ్యమైన విద్యుత్ ను 24 గంటలు అందిస్తున్న రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారీ షాక్ నే ఇస్తున్నాయి.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రానే రాదు అనుకున్న కరెంట్ పోనే పోదు అనే దాకా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగాగా విద్యుత్ చార్జీలను సైతం పెంచకుండా నెట్టుకొస్తున్న క్రమంలో కేంద్రం నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నింటికీ మించి కోవిడ్ ప్రభావంతో 4374 కోట్ల రూపాయల కలెక్షన్ నిలిచి పోవడం కుడా డిస్కమ్ లపై ఆర్థిక భారం అదనంగా పడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖామంత్రి టి.హరీష్ రావులు సోమ,మంగళవారలలో ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ ట్రాన్స్కో & జెన్కో సియం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి, ట్రాన్స్కో జే యండి శ్రీనివాసరావు తదితరులతో సుదీర్ఘమైన సమీక్షలు నిర్వహించారు.